సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మే 2023 (12:24 IST)

కోహ్లీ లెజండ్.. ఎవ్వరితో గొడవ వద్దు.. ఆ చెంపదెబ్బ.. భజ్జీ

విరాట్ కోహ్లీ లెజెండ్ అని.. ఆయన ఎవ్వరితోనూ ఇలా గొడవపడకూడదని భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. తాను శ్రీశాంత్‌ను ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెంపదెబ్బ కొట్టినందుకు తాను ఇబ్బందిపడ్డానని అంగీకరించాడు. "నువ్వు ఒక లెజెండ్... నువ్వు ఎవరితోనూ గొడవ పడకూడదు" అంటూ భజ్జీ కోహ్లీకి తెలిపాడు. 
 
"2008లో, శ్రీశాంత్‌కి నాకు మధ్య ఇలాంటి సంఘటనే జరిగింది. 15 ఏళ్ల తర్వాత, నేను ఇప్పటికీ దాని కారణంగా ఇబ్బంది పడుతున్నాను" అని హర్భజన్ గుర్తుచేసుకుంటూ చెప్పాడు. 
 
ఐపీఎల్ 2023లో సోమవారం జరిగిన లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్‌లతో జరిగిన గొడవపై హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ గొడవ కారణంగా ఆట చుట్టూ ఉన్న మంచి ఉత్సాహం చెడిపోయిందన్నాడు.