సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : సోమవారం, 8 జులై 2019 (13:42 IST)

అఖిల్‌కు జోడీగా నివేదా పేతురాజ్..?

హిట్‌ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు ఇటీవల ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు  త్వరలో బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించబోయే సినిమాలో నటించనున్నట్లు సినీవర్గాల సమాచారం.


ఈ సినిమా షూటింగ్ జూలై మూడో వారంలో ప్రారంభం కానుండగా, ఇందులో హీరోయిన్‌గా కోలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్‌ను నటింపజేయాలని చిత్రబృందం భావిస్తోందట.
 
ఇప్పటికే నివేదా పేతురాజ్ తెలుగులో ‘మెంటల్‌ మదిలో’, ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలలో నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది నివేదా. 
 
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే అఖిల్‌, నివేదా సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అల్లు అరవింద్‌, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు.