నీ స్టోరీ నాక్కాదు కానీ నా తమ్ముడు అఖిల్‌కి చెప్పు... దర్శకుడితో నాగచైతన్య
అక్కినేని అఖిల్ నటించిన మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో అఖిల్ నాలుగవ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాలుగవ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది. సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్న అఖిల్ ఈసారి అలా గ్యాప్ లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే తదుపరి చిత్రం కోసం కథలు వింటున్నాడట.
అయితే... అ.! సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇటీవల నాగ చైతన్యకి ప్రశాంత్ వర్మ కథ చెప్పాడట. ఈ కథ చైతన్యకి బాగా నచ్చిందట. అయితే... చైతన్య ప్రస్తుతం ఫుల్ బిజీ. అందుచేత ఆ కథని అఖిల్‌కి చెప్పమని ప్రశాంత్ వర్మని పంపించాడట. ప్రశాంత్ వర్మ అఖిల్‌కి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. లైన్ నచ్చడంతో ఫుల్ స్టోరీ రెడీ చేయమని చెప్పాడట.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ రాజశేఖర్‌తో కల్కి సినిమా చేస్తున్నారు. త్వరలో కల్కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఫుల్ స్ట్ర్కిప్ట్‌తో అఖిల్‌ని మెప్పిస్తే.. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. నాలుగవ సినిమా ఇంకా స్టార్ట్ కాకుండానే 5వ చిత్రం గురించి ఆలోచిస్తున్నాడు అఖిల్. బాగానే ఉంది అయితే... ఇక నుంచైనా ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకుంటే బాగుంటుంది.