జీవితంలో ఒత్తిడి ఉండదు.. భార్య, గర్ల్‌ఫ్రెండ్ వల్లే ఒత్తిడిలోకి నెడుతారు..
సాధారణంగా అస్సలు జీవితంలో ఒత్తిడి అనేది ఉండదని, కానీ భార్య, గర్ల్‌ఫ్రెండ్ వంటివాళ్లు ఒత్తిడిలోకి నెడుతారని బీసీసీఐ అధ్యక్షుడుగా ఉన్న గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇటీవల భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి, అతని స్థానంలో రోహిత్ శర్మను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. విరాట్ కోహ్లీ మాటల తూటాలు పేల్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఓ కార్యక్రమానికి హాజరైన సౌరవ్ గంగూలీ... తన వ్యక్తిగత జీవితం గురించి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. స్నేహితులు, భార్య, ప్రియురాళ్ల కారణంగానే ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటారని సెలవిచ్చారు.
ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిత్వంపై స్పందిస్తూ, అతని యాటిట్యూడ్ తనకు బాగా ఇష్టమన్నారు. కోహ్లీ బాగా కొట్లాడుతాడని చెప్పాడు. కోహ్లీకి కాస్త కోపమెక్కువని, అలాగే, అతనిలో పోరాటపటిమ కూడా ఎక్కువేనని చెప్పారు.