ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (10:58 IST)

కోహ్లీ అలా మాట్లాడకూడదు... దేశం కోసం ఆడాలి.. కపిల్ హితవు

టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగే సమయంలో కోహ్లీకి రాజీనామా చేయవద్దని తానే స్వయంగా చెప్పానని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. అయితే తనను ఎవరూ అడ్డుకోలేదని విలేకరుల సమావేశంలో ప్రస్తుత టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ వెల్లడించాడు. ఈ వివాదంలోకి ప్రస్తుతం మాజీ స్టార్ ప్లేయర్ కపిల్ దేవ్ వచ్చారు.
 
కెప్టెన్ కోహ్లీ మాటలు బీసీసీఐ అధ్యక్షుడి మధ్య బహిరంగ వ్యాఖ్యలు భారత క్రికెట్ ప్రతిష్టను ప్రభావితం చేసిందని.. బోర్డు అధ్యక్షుడికి వ్యతిరేకంగా కోహ్లీ మాట్లాడకూడదని కపిల్ హితవు పలికాడు. 
 
"నేను కోహ్లీకి పెద్ద అభిమానిని, కానీ ఏ ఆటగాడు బీసీసీఐ అధ్యక్షుడికి లేదా బోర్డుకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నన్ను కెప్టెన్సీ నుండి తప్పించినప్పుడు, నేను కూడా చాలా బాధపడ్డాను, కానీ మీరు దేశం కోసం ఆడుతున్నారని గుర్తుంచుకోండి. అంతకు మించి ఇంకేమీ ముఖ్యం కాదు." అంటూ కపిల్ స్పష్టం చేశాడు.
 
ఈ మొత్తం రచ్చ తర్వాత బీసీసీఐ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ, ప్రస్తుత వివాదం టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీని ప్రభావితం చేయకూడదని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.