సోమవారం, 30 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (19:56 IST)

సౌతాఫ్రికా పర్యటన నుంచి రోహిత్ శర్మ ఔట్

భారత క్రికెట్ జట్టు త్వరలోనే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో హిట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 
 
ముంబైలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఈ కారణంగా ఈ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. రోహిత్ స్థానాన్ని గుజరాత్ ఆటగాడు ప్రియాంక్ పాంచల్‌తో భర్తీ చేస్తున్నామని అందులో పేర్కొంది.
 
కాగా, ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు టెస్టులు ఆడాల్సివుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మలను బీసీసీఐ ఎంపిక చేసింది.