శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (14:23 IST)

మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ముచ్చటగా మూడో వివాహం చేసేసుకున్నారు. ఆయన ప్రముఖ ఆధ్మాత్మిక సలహాదారు బుష్రా మనేకాను పెళ్లి చేసుక

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ముచ్చటగా మూడో వివాహం చేసేసుకున్నారు. ఆయన ప్రముఖ ఆధ్మాత్మిక సలహాదారు బుష్రా మనేకాను పెళ్లి చేసుకున్నట్టు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ అధికారికంగా వెల్లడించింది. వీరిద్దరి వివాహం ఆదివారం లాహోర్‌లో జరిగింది. బుష్రా మనేకా సోదరుడు నివాసంలో ఈ వివాహం జరిగింది. కాగా, గత జనవరి నుంచి వీరిద్దరి వివాహం గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు రాగా.. పీటీఐ వాటిని ఖండిస్తూ వస్తోంది. 
 
ఇదిలావుండగా, 1992లో పాక్‌ జట్టుకు క్రికెట్‌ ప్రపంచ కప్‌ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్‌.. తొలుత బ్రిటిష్‌ జర్నలిస్టు జెమీమాను పెళ్లి చేసుకున్నాడు. తొమ్మిదేళ్ల పాటు భార్యాభర్తలుగా జీవించిన తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్న ఇమ్రాన్.. రేహమ్‌ను అనే జర్నలిస్టును గత 2015లో రెండో వివాహం చేసుకున్నాడు. వీరి వివాహ బంధం పట్టుమని పది నెలలు కూడా కొనసాగలేదు. అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతూ వచ్చిన ఇమ్రాన్.. ఆదివారం బుష్రా మనేకాను మూడో వివాహం చేసుకున్నాడు.