ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (12:38 IST)

బెంగుళూరు టెస్ట్ : భారత్‌ను నడ్డివిరిచిన హాజెల్‌వుడ్.. భారత్ 274 ఆలౌట్

బెంగుళూరు వేదికగా జరుగున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ హాజెల్‌వుడ్ బంతితో రెచ్చిపోయాడు. తన మ్యాజిక్ బౌలింగ్‌లో ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్లను ఔట్ చేశాడు. ఫలితంగా టీమిండియా 274 పరుగులకే ఆలౌ

బెంగుళూరు వేదికగా జరుగున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ హాజెల్‌వుడ్ బంతితో రెచ్చిపోయాడు. తన మ్యాజిక్ బౌలింగ్‌లో ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్లను ఔట్ చేశాడు. ఫలితంగా టీమిండియా 274 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముంగిట 188 పరుగుల చిన్నపాటి విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో హాజెల్‌వుడ్ ఆరు వికెట్లు తీయ‌గా, స్టార్క్ రెండు, ఓకీఫె రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. 
 
అంతకుముందు భారత్ తన ఓవర్ నైట్ స్కోరు 213/4తో మంగళవారం బ్యాటింగ్ చేపట్టింది. అయితే, ఆసీస్ బౌలింగ్ ముందు భారత టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. ఫలితంగా భారత్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో పేకమేడలా కూలిన భారత రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటింది. సిరీస్‌‌లో తొలిసారి రెండొందల మార్కు దాటింది. 
 
స్కోరుబోర్డు 
భారత్ తొలి ఇన్నింగ్స్‌: 189 ఆలౌట్‌; 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 276 ఆలౌట్‌;
భారత్ రెండో ఇన్నింగ్స్ : 274 ఆలౌట్.