గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (15:40 IST)

బెంగుళూరు టెస్ట్ మ్యాచ్ : 45 పరుగులకే కుప్పకూలిన భారత్

test india
బెంగులూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్‌ను కివీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. కివీస్ బౌలర్ల విజృంభణతో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో భోజన విరామ సమయానికి 34 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత కూడా ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. 
 
భారత ఆటగాళ్లలో కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. మధ్యలో యశస్వి జైస్వాల్ మాత్రం 13 పరుగులు, రిషబ్ పంత్ 20 పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్నారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 
 
పంత్ ఔట్ కావడంతో రోహిత్ సేన 39 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 31.2 ఓవర్లలో 46 రన్స్‌కే చేతులెత్తేసింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీయగా, విలియన్ ఓ రూర్కే నాలుగు వికెట్లుతో భారత ఇన్నింగ్స్ పతనంలో తమ వంతు పాత్ర పోషించారు. కాగా, టెస్టుల్లో భారత్ చేసిన మూడో అతి తక్కువ పరుగులు కావడం గమనార్హం.