1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. India brace for Wellington wind with series win in sight

నేడు కివీస్‌తో మూడో టీ20 - సిరీస్‌పై కన్నేసిన భారత జట్టు

cricket
భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇందులోభాగంగా, ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడుతోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌‍లలో విజయం సాధించిన టీమిండియా.. మరో రెండు మ్యాచ్‌లు మగిలివుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులోభాగంగా, మంగళవారం జరిగే మూడో టీ20పై కన్నేసింది. ఈ మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా జరుగనుంది. 
 
క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో భారత కుర్రోళ్లు ఘన విజయాలను సాధించారు. దీంతో భారత్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌‍ను తమ ఖాతాలో వేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు ఉవ్విళ్లూరుతోంది.
 
భారత జట్టు బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తున్నా, బౌలింగ్ విభాగం ఆందోళన కలిగిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లో 226, 181 పరుగుల భారీ లక్ష్యాలను ఛేదించడంలో బ్యాటర్లు సఫలమయ్యారు. 
 
దాదాపు నాలుగేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 8 ఓవర్లు వేసి 99 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఒకే వికెట్ తీసి, 12.37 ఎకానమీతో పరుగులు ధారాళంగా ఇచ్చేశాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను తిరిగి లయను అందుకుంటాడని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. 
 
మరోవైపు, ఇషాన్ కిషన్ గాయం కారణంగా దూరం కావడంతో, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 స్థానంలో మరో అవకాశం లభించింది. గత మ్యాచ్లో 8 బంతుల్లో 4 పరుగులే చేసి నిరాశపరిచిన అతడు, ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నాడు.
 
మరోవైపు, ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ సిరీస్ మొత్తానికి దూరం కాగా, మరో కీలక బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. వారి స్థానంలో కైల్ జెమీసన్, మ్యాట్ ఫిషర్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆల్ రౌండ్ ప్రదర్శన, గ్లెన్ ఫిలిప్స్ వంటి ఫామ్ లో ఉన్న బ్యాటర్లపైనే కివీస్ ఆశలు పెట్టుకుంది.
 
వెల్లింగ్టన్ పిచ్ గణాంకాలు చూస్తే, 2016 నుంచి ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లలో సగటు స్కోరు 165గా ఉంది. ఇక్కడ జరిగిన 18 మ్యాచ్‌లలో 10 సార్లు ఛేజింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. మ్యాచ్ సమయంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నా, వర్షం పడే సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. 
 
టీ20లలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన పోరులో భారత్ 21-11 ఆధిక్యంలో ఉంది. అయితే, వెల్లింగ్టన్‌లో మాత్రం న్యూజిలాండ్ 2-1తో ముందంజలో ఉంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భారత క్రికెట్ జట్టు అరుదైన రికార్డు... ప్రపంచంలోనే తొలి జట్టుగా ఆవిర్భావం