సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (10:14 IST)

హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకుంటున్నాడు.. అయితే..? రోహిత్ శర్మ

Hardik Pandya
గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని అయితే, తర్వాతి మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో ఉండడం లేదని కెప్టెన్ రోహిత్‌శర్మ చెప్పాడు. 
 
ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రతి మూడు నాలుగు రోజులకు ఒక మ్యాచ్ ఉండడంతో బ్యాటింగ్, బౌలింగ్ భారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుందన్నాడు. 
 
హార్దిక్ విషయంలో ఫలితాలు పాజిటివ్‌గానే ఉన్నాయని, త్వరలోనే అతడిని గ్రౌండ్‌లో చూస్తామని చెప్పుకొచ్చాడు. చీలమండ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న పాండ్యా నెదర్లాండ్స్‌తో ఈ నెల 12న బెంగళూరులో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువగానే ఉంది.