ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై ఆపరేషన్ సిందూర్ ప్రభావమెంత?
గత కొన్ని రోజులుగా స్వదేశంలో ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్లే ఆఫ్స్ పోటీలు ప్రారంభంకావాల్సి వుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ సిందూర్‌కు శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రస్థావరాలు ధ్వంసం చేస్తోంది. ఇందుకోసం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత రక్షణ శాఖకు చెందిన త్రివిధ దళాలు సంయక్తంగా మెరుపు దాడులు నిర్వహించి తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.
ఈ దాడులను ప్రపంచం యావత్ స్వాగతిస్తోంది. కానీ, పాకిస్థాన్ మాత్రం షాక్ నుంచి ఇంకా తేరుకోలోదు. ఇదిలావుంటే ఆపరేషన్ సిందూర్ ఐపీఎల్ పోటీల నిర్వహణపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ ఆడే విదేశీ క్రికెటర్ల భద్రత ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పందించింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థిని నిశితంగా పరిలిస్తున్నాం. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాటి సమాచారం, సంకేతాలు రాలేదు. పరిస్థితులు తీవ్రంగా మారితే అపుడు నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు యధావిధిగా ఈ పోటీలు జరుగుతాయని బీసీసీఐ ఉన్నతాధికారులు వెల్లడించారు.