శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (18:35 IST)

భారత క్రికెట్ జట్టుకు ఆరెంజ్ రంగు జెర్సీ...

orange jercy
భారత క్రికెట్ జట్టుకు కొత్త యూనిఫాం అందుబాటులోకి రానుంది. స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ క్రికెట్ జట్టు సభ్యులకు కొత్త జెర్సీని బీసీసీఐ సిద్ధం చేసింది. ఈ దుస్తులు ధరించిన భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో కనిపించారు. అలాగే, మీడియా సమావేశానికి కూడా ఆరెంజ్ జెర్సీతోనే కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యారు. దాంతో టీమిండియా జెర్సీ మారిందంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ, ఒక్క మ్యాచ్ కోసం కిట్‌ను మార్చడం జరగదని సెలవిచ్చింది. 
 
టీమిండియా జెర్సీలపై సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఒట్టి ఊహాగానాలతో కూడిన వార్తలేనని కొట్టిపారేసింది. కేవలం ఒక్క మ్యాచ్ కోసం మరో కిట్‌ను ధరించడం జరగదని పేర్కొంది. ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రచారం చేయడం సరికాదని బోర్డు హితవు పలికింది. 
 
నిజానికి భారత్ క్రికెటర్లు ఎంతో కాలంగా బ్లూ రంగు జెర్సీలను ధరిస్తున్నారు. అందుకే మెన్ అండ్ బ్లూగా టీమిండియాను పిలుస్తుంటారు. అయితే, ఇపుడు ఆరెంజ్ రంగు తెరపైకి రావడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బ్లూ రంగ భారత క్రీడారంగానికి సంబంధించిన రంగు. వరల్డ్ కప్ లోనూ ఈ రంగును మార్చడం జరగదు అని స్పష్టం చేసింది. కాగా, ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఈ నెల 14వ తేదీన పాకిస్థాన్ జట్టుతో భారత్ తలపడనుంది.