శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (12:55 IST)

భారత్ -ఇంగ్లండ్‌‌ రెండో టెస్టు.. పుజారా అవుటైన తీరు చూస్తే..? వీడియో వైరల్

Cheteshwar Pujara
భారత్ -ఇంగ్లండ్‌‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో భారత బ్యాట్స్‌మన్ చెటేశ్వర్ పుజారా అవుటైన తీరు చాలా వింతగా ఉంది. మోయిన్ అలీ బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఆడబోయిన పుజారా ప్యాడ్‌కు తగిలి బంతి షార్ట్ లెగ్‌లో ఉన్న ఓలీ పోప్ చేతిలో పడింది. అతడు వెంటనే బంతిని వికెట్ కీపర్‌కు విసిరాడు. ఆలోపే క్రీజులోకి వెళ్లడానికి పుజారా ప్రయత్నించినా.. అతని చేతిలో నుంచి బ్యాట్ కింద పడిపోయింది.
 
తన కాలును క్రీజులో పెట్టేలోపే వికెట్ కీపర్ ఫోక్స్‌.. వికెట్లను గిరాటేశాడు. దీంతో పుజారా నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. పుజారా రనౌట్ బ్యాడ్ లక్ అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా అవుతుంది.
 
ఇకపోతే.. చెన్నై వేదికగా చెపాక్‌ స్టేడియంలో జరుగుతోన్న భారత్-ఇంగ్లాండ్‌ రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారీ ఆధిక్యంతో ఈరోజు మ్యాచ్‌ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బతగిలింది.ఇంగ్లాండ్‌ బౌలర్ల దాటికి భారత బ్యాట్స్‌మెన్‌లు వరుసగా వెనుదిరుగుతున్నారు. మూడో రోజు మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే పుజారా రన్‌ అవుట్‌ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది. 
 
19 ఓవర్‌ చివరి బంతికి పరుగు తీసే క్రమంలో పుజారాను పోప్‌ రన్‌ అవుట్‌ చేశాడు. ఇక అనంతరం జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (26) కూడా క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం కేవలం 6 ఓవర్ల వ్యవధిలోనే రిషబ్‌ పంత్‌ కూడా అవుట్‌ అయ్యాడు. 25.3 ఓవర్‌ వద్ద జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఫోక్స్‌ చేతిలో స్టంప్‌ అవుట్‌ అయ్యాడు. తర్వాత 30.3 ఓవర్‌ వద్ద రహానే అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత స్కోర్‌ 33 ఓవర్లకు 97/5 వద్ద కొనసాగుతోంది.