గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (09:51 IST)

India vs England - 2nd test: కోహ్లీకి పరీక్షే.. తాడోపేడో తేల్చుకుంటుందా?

India_England Match
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. బెంగళూరు వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలిటెస్ట్‌లో 227 పరుగులతో ఓటమిపాలైన టీమిండియా నాలుగు టెస్టుల సిరిస్‌లో 0-1 వెనుకపడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ మార్పులు చేసింది. ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ టెస్టుల్లో అరంగ్రేటం చేస్తున్నాడు. 
 
బుమ్రా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను, వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో అక్షర్‌పటేల్‌, షాబాజ్‌ నదీమ్‌ స్థానంలో కుల్దీప్‌కు అవకాశం ఇచ్చారు. సుమారు రెండేళ్ల విరామం అనంతరం టెస్టుల్లోకి కుల్దీప్‌ యాదవ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే ఇంగ్లాండ్‌ సైతం నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. 
 
అండర్సన్‌, బట్లర్‌, ఆర్చర్‌, బెస్‌కు విశ్రాంతి ఇవ్వగా.. బ్రాడ్‌, ఫోక్స్‌, స్టోన్‌, మొయిల్‌ అలీని తుదిజట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతి ఇచ్చారు. తొలిటెస్టుకు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించగా.. రెండో టెస్టుకు 50శాతం మంది వీక్షకులకు అవకాశం ఇచ్చారు.
 
ఇకపోతే.. తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన టీమిండియా శనివారంనుంచి రెండోటెస్ట్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ విజయాన్ని సాధించి భారీ అంచనాలతో ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు దిగిన కోహ్లి సేన చెన్నై టెస్ట్‌లో 227 పరుగుల తేడాతో ఓడింది. 
 
ఆ టెస్ట్‌ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కోహ్లి సేన ఆల్‌రౌండర్లతోపాటు, ఉపకెప్టెన్‌ రహానే కీలక ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరముంది. గత టెస్ట్‌ విజయంతో ఇంగ్లాండ్‌ నాల్గు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచింది. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఈ టెస్ట్‌లో భారత్‌ తప్పక గెలవాల్సి ఉంది. 
 
ఇక ఇంగ్లాండ్,భారత్ మధ్య చపాక్ స్టేడియం వేదికగా శనివారం రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ముందంజలో ఉంది. తొలి టెస్టులో ఘోరంగా ఓడిన టీమిండియా ఇప్పుడు బదులు తీర్చుకోవాలని చూస్తోంది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో నిలవాలంటే భారత్‌ ఖచ్చితంగా మిగిలిన 3 టెస్టుల్లో కనీసం 2 మ్యాచ్‌లైనా గెలవాల్సిందే. 
 
చాలా రోజుల తర్వాత భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఇస్తోంది బీసీసీఐ. కరోనా బ్రెక్ తర్వాత ప్రేక్షకులను అనుమతిస్తున్న తొలి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు 50 శాతం మంది అభిమానులు మైదానంలోకి అనుమతి ఇస్తారు. టీమిండియాలో మూడు మార్పులు చేశారు. అలాగే ఇంగ్లీస్ జట్టులో నాలుగు మార్పులు చేశారు.
 
భారత్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మాన్‌ గిల్, చేటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (సి), అజింక్య రహానె, రిషబ్ పంత్ (డబ్ల్యూ), ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్.
 
ఇంగ్లాండ్ జట్టు : డోమ్ సిబ్లీ, రోరే బర్న్స్, డాన్ లారెన్స్, జో రూట్ (సి), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్, మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, ఆలీ స్టోన్.