శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (12:01 IST)

India vs England: చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు, టీమిండియాకు ఎదురుదెబ్బ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో చెపాక్ పిచ్‌ స్పిన్నర్లకు పూర్తిగా సహకరిస్తుండడంతో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగుతున్నారు. జాక్ లీచ్, మొయిన్ అలీ దాటికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన ఐదు వికెట్లు‌ కోల్పోయింది. మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీసేన గంటలోనే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది.

దీంతో డ్రింక్స్‌ విరామ సమయానికి 97/5తో నిలిచింది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (18), ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ ‌(2) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 35 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీసేన ఆధిక్యం 297 పరుగులకు చేరింది.
 
మూడో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 54/1తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొయిన్ అలీ‌‌ బౌలింగ్‌లో చేటేశ్వర్ పుజారా (7) అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన అలీ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి ఆడడంలో విఫలమయిన పుజారా వెనుదిరిగాడు. ఇక జాక్ లీచ్ బౌలింగ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (26) స్టంప్ ఔట్ అయ్యాడు. మరికొద్ది సేపటికే లీచ్‌‌ బౌలింగ్‌లోనే రిషబ్ పంత్ (8) కూడా స్టంప్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.
 
వైస్ కెప్టెన్ అజింక్య రహానే (10) రెండు బౌండరీలు బాది మంచి ఊపులో కనిపించాడు. అయితే మొయిన్ అలీ‌‌ బౌలింగ్‌లో ఓలి పోప్‌కి చిక్కి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆపై ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ అండతో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డును ముందు నడిపిస్తున్నాడు. కోహ్లీ (18), అక్షర్‌ ‌(2) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 35 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీసేన ఆధిక్యం 297 పరుగులకు చేరింది.