కోహ్లీ ఇచ్చిన సూపర్ ఐడియా.. ఇషాంత్ విసిరిన బంతికి వికెట్- వీడియో వైరల్

సెల్వి| Last Updated: శుక్రవారం, 4 అక్టోబరు 2019 (19:01 IST)
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇషాంత్ శర్మకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అడ్వైజ్ ఇచ్చాడు. అతనిచ్చిన సూచనతో ఇషాంత్ శర్మ విసిరిన బంతిని వికెట్‌గా మలిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టు మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతోంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి 502 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 215 పరుగులు, రోహిత్ శర్మ 176 పరుగులు అత్యధిక పరుగులు సాధించారు. తదనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు సాధించింది.

ఈ మ్యాచ్‌లో అప్పుడప్పుడు బౌండరీలు సాధించి భారత బౌలర్లకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా స్టార్ తెంబాను విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ పక్కా ప్లాన్‌తో అవుట్ చేశారు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌కు ముందు కోహ్లీ అతనికి అడ్వైజ్ చేశాడు. ఏదో ఐడియా ఇచ్చాడు.

తదనంతరం ఇషాంత్ విసిరిన బంతికి తెంబా అవుట్ అయ్యాడు. ఎల్‌బీడబ్ల్యూతో
పెవిలియన్ ముఖం పట్టాడు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.దీనిపై మరింత చదవండి :