మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

భారత క్రికెట్ జట్టుకు ఇద్దరి సేవలు అక్కర్లేదు : గంగూలీ

భారత మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు మరింత పటిష్టంగా ఉండాలంటే ఇద్దరు క్రికెటర్లను జట్టు నుంచి తొలగించాలని కోరారు. ముఖ్యంగా, మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌లను తిరిగి ఎంపిక చేయాలని సూచన చేశారు. 
 
ఇదే అంశంపై సౌరవ్ స్పందిస్తూ, ప్రస్తుతం యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో చహల్‌ను పక్కకు పెట్టినప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో అతని అవసరం చాలా ఉందన్నాడు. వచ్చే ఏడాది వరల్డ్‌ టీ20 జరుగనున్న నేపథ్యంలో కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌లు ఎంతో ముఖ్యమన్నాడు. వీరిద్దరూ జట్టులో ఉంటే భారత జట్టు మరింత బలోపేతం అవుతుందని చెప్పాడు. 
 
కాగా, వరల్డ్‌ టీ20 ఫలితం ఎలా ఉండబోతుందనే దానిపై మాత్రం గంగూలీ సమాధానం చెప్పలేదు. కాకపోతే ఆ మెగా టోర్నీలో విరాట్‌ కోహ్లి కీలక పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నానన్నాడు. ఆ వరల్డ్‌కప్‌ కోహ్లీ చాలా ముఖ్యమైనదన్నాడు. 
 
అదేసమయంలో భారత జట్టు ఇద్దరు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యాలు అవసరం లేదన్నాడు. వీరిలో ఎవరో ఒకరు ఉంటే సరిపోతుందన్నాడు. ఆ ఇద్దర్నీ ఒకే మ్యాచ్‌ తుది జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తించాలని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.