శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (12:49 IST)

అత్యధిక టై మ్యాచ్‌లు నమోదు చేసిన రెండో జట్టుగా భారత్!!

Team India
భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇప్పటికే ముగిసిన టీ20 టోర్నీని క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం నుంచి వన్డే సిరీస్ టోర్నీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ కొలంబో వేదికగా శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో భారత్ కూడా సమంగా 231 పరుగులు చేసింది. 48వ ఓవరులో భారత విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో క్రీజులో ఉన్న అర్షదీప్ సింగ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసింది. 
 
ఫలితంగా వన్డే క్రికెట్లో భారత్ పేరిట ఓ రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్లో అత్యధిక టై మ్యాచ్‌లను నమోదు చేసిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లను భారత్ అధిగమించింది. శ్రీలంకతో జరిగిన తాజా వన్డేతో కలుపుకొని ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్ 10 టైగా ముగిశాయి. మొత్తం 11 టై మ్యాచ్‌లతో వెస్టిండీస్ అగ్రస్థానంలో ఉండగా భారత్ రెండో స్థానానికి చేరింది. ఈ క్రమంలో 9 చొప్పున టై మ్యాచ్‌లతో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లను భారత్ అధిగమించింది. ఇక 8 టై మ్యాచ్‌లతో జింబాబ్వే ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.