1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (14:48 IST)

కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న శ్రీలంక... వికెట్ కోల్పోయిన భారత్

Rohit Sharma
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, గురువారం భారత్ శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా మైదానంలోకి వచ్చిన రోహిత్ శర్మ, గిల్‌‌లు బ్యాటింగ్‌ ప్రారంభించారు. అయితే, భారత్ మొదటి ఓవర్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 7.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. ఇందులో గిల్ 10, కోహ్లీ 26 చొప్పున పరుగులతో ఉన్నారు. తొలి వికెట్‌ను శ్రీలంక బౌలర్ మధుషంక పడగొట్టాడు. 
 
కాగా, ఈ టోర్నీలో భారత ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఆరింటిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందితే భారత్ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టనుంది. ఇదే జరిగితే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 మెగా ఈవెంట్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. అలాగే, పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుపొంది సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇంకోవైపు, శ్రీలంక జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.