1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (16:28 IST)

విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్.. తొలి భారత క్రికెటర్‌గా..

Virat Kohli
తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ తాజాగా అరుదైన రికార్డును నెలకొల్పాడు. విరాట్ కోహ్లి 2023 సంవత్సరంలో అత్యధికంగా శోధించిన ఆసియా అథ్లెట్‌గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. 
 
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుల్లో కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. 
 
ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌ల జాబితాలో 354 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. 
 
ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన టీమ్ ఇండియా.. అందులో ఐదింటిలో గెలిచి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. వన్డేల్లో అత్యంత వేగంగా 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. 
 
కోహ్లీ 213 మ్యాచ్‌లు 205 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అతని తర్వాత, రోహిత్ శర్మ 248 మ్యాచ్‌లు, 241 ఇన్నింగ్స్‌లలో పది వేల పరుగులు సాధించాడు. ఈ జాబితాలో సచిన్ మూడో స్థానంలో ఉన్నాడు.