శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (19:04 IST)

ఆల్ఫాబెట్ ద్వారా 50మందిని తొలగించిన గూగుల్ న్యూస్

Google
గూగుల్ యాజమాన్య సంస్థ "ఆల్ఫాబెట్" ద్వారా దాదాపు 50 మంది ఉద్యోగులను గూగుల్ న్యూస్ విభాగం నుంచి తొలగించినట్లు సమాచారం. టెక్ దిగ్గజం గూగుల్ ఈ వారం తన వార్తల విభాగం నుండి 40-45 మంది సిబ్బందిని తొలగించినట్లు పుకార్లు వచ్చాయి. ఈ విషయంపై Google నుండి అధికారిక సమాచారం లేదు.
 
ఎంత మందిని తొలగించారనే దానిపై స్పష్టత లేదు. అయితే, ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి ప్రకారం, కనీసం 50 మంది గూగుల్ న్యూస్ డివిజన్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. 
 
వందలాది మంది ఉద్యోగులు ఇప్పటికీ గూగుల్ వార్తా విభాగంలో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ లే ఆఫ్ కొద్ది మంది ఉద్యోగులకే పరిమితమైనప్పటికీ.. రానున్న కాలంలో న్యూస్ డివిజన్ సహా పలు విభాగాల్లో లే ఆఫ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
గూగుల్ దీర్ఘకాలిక మానవ వనరుల పెట్టుబడులలో వార్తల విభాగం కూడా ఒకటి. ప్రస్తుత లే-ఆఫ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను పొందడానికి కంపెనీ సహాయం చేస్తుందని గూగుల్ ప్రతినిధి వెల్లడించారు. 
 
గత నెల ప్రారంభంలో, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తన గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుండి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2023లో, మెటా, మైక్రోసాఫ్ట్, అమేజాన్ వంటి దిగ్గజాలు ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను తొలగించాయి.