సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2017 (17:31 IST)

కోల్‌కతా టెస్ట్ : నిలకడగా భారత్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. ఆదివారం సాయంత్రంలో తొలి టెస్ట్ నాలుగో రోజు ఆట ముగియగా, భారత్ తన రెండో ఇన

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. ఆదివారం సాయంత్రంలో తొలి టెస్ట్ నాలుగో రోజు ఆట ముగియగా, భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. 
 
అంతకుముందు శ్రీలంక జట్టు మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్ 164/4తో ఆటని ప్రారంభించిన లంక ఆటగాళ్లు.. తొలుత కాస్త దూకుడుగా ఆడిన అనంతరం తడబడ్డారు. 83.4 ఓవర్లలో లంక 10 వికెట్లు కోల్పోయి.. 294 పరుగులు చేసి.. లంక తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగుల ఆధిక్యం సాధించింది.
 
ఆ పిమ్మట రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత ఓపెనర్లు నిలకడగా ఆడారు. తొలి వికెట్‌కి 166 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సెంచరీకి చేరువలో ఉండగా శనకా బౌలింగ్‌లో శిఖర్ ధావన్(94) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం బ్యాటింగ్‌లో రాహుల్(73), పుజారా(2) ఉన్నారు. 
 
ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో భారత్ శ్రీలంకపై 49పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో ఒక్కరోజు మాత్రమే ఆట మిగిలివుండటంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.