బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2017 (14:08 IST)

కోల్‌కతా టెస్టు: శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 294 ఆలౌట్

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 122 పరుగుల ఆధిక్యాన్ని సాధించి

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 122 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్ 165/4తో నాలుగో రోజు ఉదయం ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టుకు శుభారంభం దక్కలేదు. 83.4  ఓవర్లకు 294 పరుగులకు ఆలౌటైంది. 
 
శ్రీలంక బ్యాటింగ్ లో రంగనా హెరాత్ (67), మ్యాథ్యూస్ (52), తిరిమన్నె (51), డిక్ వెలా (35) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్ లో భువనేశ్వర్ 4, షమీ 4, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో172 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే.