బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2017 (12:38 IST)

ఏటీపీ ఫైనల్‌లో ఫెదరర్‌ ఔట్‌.. హాంగ్‌కాంగ్‌కూ శ్రీకాంత్‌ దూరం

స్విస్‌ టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ సీజన్‌ తుది టెన్నిస్‌ సమరం ఏటీపీ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టారు. సెమీస్‌ పోరులో డెవిడ్‌ గోఫిన్‌ (బెల్జియం) చేతిలో 6-2, 3-6, 4-6తో పరాజయం పాలయ్యాడు.

స్విస్‌ టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ సీజన్‌ తుది టెన్నిస్‌ సమరం ఏటీపీ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టారు. సెమీస్‌ పోరులో డెవిడ్‌ గోఫిన్‌ (బెల్జియం) చేతిలో 6-2, 3-6, 4-6తో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఫెదరర్ మంచి శుభారంభమే చేసినా బ్రేక్‌ పాయింట్లు కాపాడుకోవటంలో విఫలమై.. ఈ సీజన్‌ను ఓటమితో ముగించాడు. తుది గ్రూప్‌ పోరులో కారెనో బుస్టా‌పై గెలిచిన దిమిత్రోవ్‌ ఫైనల్లో చోటు కోసం ఆదివారం జాక్‌ సాక్‌తో తలపడనున్నాడు.
 
మరోవైపు, భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ మరో సూపర్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. ఇటీవల కండరాల గాయానికి గురైన శ్రీకాంత్‌ చైనా ఓపెన్‌లో పాల్గొనలేదు. మరో వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యుల సూచించటంతో ఈ మంగళవారం నుంచి ఆరంభం కానున్న హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌కూ శ్రీకాంత్‌ దూరమయ్యాడు. గాయాలతో సమీర్‌ వర్మ, అజరు జయరాంలు సైతం ఆడటం లేదు.