శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (13:59 IST)

ఆటవిడుపు... కోర్టులో ఫెదరర్ డాన్స్... (Video)

స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటవిడుపు కోసం కోర్టులో డాన్స్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటవిడుపు కోసం కోర్టులో డాన్స్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చైనాలో షాంగైలో రోలెక్స్‌ మాస్టర్స్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్ ఆడేముందు 19 గ్రాండ్ స్లామ్ టోర్నీల విజేత రోజర్ ఫెదరర్ స్టేడియంలోకి వచ్చాడు. 
 
ఇంతలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు మిక్కీ మౌస్ వేషధారణలో ఉన్న వ్యక్తి ఫెదరర్ వద్దకు వచ్చి డాన్స్ చేయాలని కోరాడు. అతని కోరికమేరకు తన చేతిలోని టెన్నిస్ రాకెట్‌ను మరో కుర్రోడి చేతికిచ్చి ఫెదరర్ డాన్స్ చేశాడు. ఈ వీడియోను ఏటీపీ టెన్నిస్ టీవీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అవుతోంది.