శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (09:09 IST)

యూట్యూబ్‌లో దేశీ డ్యాన్స్.. క్లాస్ రూమ్‌లోనే ప్రాక్టీస్ (వీడియో)

సామాజిక మాధ్యమాల ప్రభావంతో చిన్న విషయం జరిగినా యూట్యూబ్‌లో వీడియో ద్వారా ప్రత్యక్షమవుతోంది. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు సంపాదించాలని చాలామంది తాపత్రయ పడుతుంటారు. అలాంటి వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో

సామాజిక మాధ్యమాల ప్రభావంతో చిన్న విషయం జరిగినా యూట్యూబ్‌లో వీడియో ద్వారా ప్రత్యక్షమవుతోంది. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు సంపాదించాలని చాలామంది తాపత్రయ పడుతుంటారు. అలాంటి వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను 2016లోనే పోస్టు చేసినప్పటికీ ఇటీవలి కాలంలో మరింత పాపులర్ అయ్యింది. 
 
ఇప్పటిదాకా ఈ వీడియోను 60లక్షల మంది వీక్షించారు. అలాగే చాలామంది దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక తరగతి గదిలో ఒక విద్యార్థిని.. మరో విద్యార్థితో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. తరగతి గదిలోనే సాగుతున్న ఈ యవ్వారాన్ని వీడియోలో బంధించి సోషల్ మీడియోలో  పోస్టు చేశారు. యూట్యూబ్‌లో దేశీ డ్యాన్స్ టీం పేరిట గల అకౌంట్‌లో దీనిని అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.