గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (17:45 IST)

సింపుల్ చాలెంజ్... వాళ్ల అభ్యర్థి ఓడితే రోజా అది చేయించుకుంటే చాలు... బోండా(వీడియో)

వైసిపి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, మాట్లాడే మాటల్లో అర్థం ఉండాలని, నంద్యాల ఉపఎన్నికల్లో అధికార పార్టీపై అనవసర విమర్శలు చేసిన రో

వైసిపి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, మాట్లాడే మాటల్లో అర్థం ఉండాలని, నంద్యాల ఉపఎన్నికల్లో అధికార పార్టీపై అనవసర విమర్శలు చేసిన రోజాకు బహిరంగ సవాల్ విసురుతున్నానన్నారు బోండా ఉమ. 
 
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి ఓడిపోతే నంద్యాలలోని నడిరోడ్డుపై గుండు గీయించుకోవడానికి తాను సిద్థంగా ఉన్నానని, అదే వైసిపి అభ్యర్థి ఓడిపోతే గుండు గీయించుకోవడానికి రోజా సిద్ధంగా ఉన్నారా అంటూ బహిరంగ సవాల్ విసిరారు బోండా ఉమ. పెద్దపెద్ద మాటలు వద్దనీ, ఇదో సింపుల్ చాలెంజ్ అనీ, పార్టీ కార్యాలయాలు మూసుకోవడం, రాజకీయ సన్యాసాలు చేసుకోవడం అంతా వద్దనీ... ఎవరి పార్టీ అభ్యర్థి ఓడితే వాళ్లు గుండు కొట్టించుకుంటే చాలన్నారు. తమ పార్టీ అభ్యర్థి ఓడితే తను గుండు గీయించుకోవడానికి సిద్ధమనీ, రోజా కూడా తన సవాలును తీసుకుంటారా అని ప్రశ్నించారు.
 
బోండా ఉమ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై రోజా గాని, ఆ పార్టీ నేతలు గాని అస్సలు స్పందించడం లేదు. కాగా నేటితో నంద్యాల ఉపఎన్నికల ప్రచారం ముగిసింది.