1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. India win by 22 runs to clinch the ODI series 3-1

న్యూజిలాండ్‌పై భారత్ సంచలన విజయం : ఏడేళ్ల తర్వాత వన్డే సిరీస్ కైవసం

team india
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్ సంచలన విజయం సాధించింది. ఆతిథ్య కివీస్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను ఏడేళ్ల తర్వాత కైవసం చేసుకుంది. కివీస్ పర్యటనలో ఉన్న భారత్.. ఇప్పటికీ టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోగా, ఇపుడు వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ గెలవగా, మూడో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. నాలుగో మ్యాచ్‌లో కివీస్ గెలిచిన విషయం తెల్సిందే. దీంతో సిరీస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఐదో మ్యాచ్‌లో భారత్ 22 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో వన్డే సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో కివీస్ 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31) టాప్ స్కోరర్. నిక్ కెల్లీ (24), మిచెల్ శాంటర్న్ (24), విల్ యంగ్ (22), మైకేల్ బ్రాస్‌వెల్ (19), క్రిస్టియన్ క్లార్క్ (16) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, అక్షర్ పటేల్ 2, సిరాజ్ 2, అకిబ్ నబీ, యశ్‌ ఠాకూర్, నమన్ ధిర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
 
భారత బ్యాటర్లలో అక్షర్ పటేల్ (46; 55 బంతుల్లో), ఇషాన్ కిషన్ (46; 58 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5) నిరాశపర్చారు. శ్రేయస్ అయ్యర్ (22), రుతురాజ్ గైక్వాడ్ (18) రన్స్ చేశారు. చివర్లో మహ్మద్ సిరాజ్ (14 నాటౌట్; 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌), అర్ష్‌దీప్ (14; 4 బంతుల్లో 2 సిక్స్‌లు) విలువైన పరుగులు రాబట్టారు.
 
కాగా, ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఏడేళ్ల తర్వాత స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోడం గమనార్హం. అలాగే, 10 ఓవర్లు వేసి 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్నాడు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భారత కుర్రోళ్ళ పోరాటం అద్భుతం.... : పాకిస్థాన్ కెప్టెన్