శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (13:06 IST)

ధోనీ ఖాతాలో ప్రపంచ రికార్డు.. అత్యధిక క్యాచ్‌లు పడగొట్టిన వికెట్ కీపర్‌గా...

Dhoni
ధోనీ ఖాతాలో ప్రపంచ రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌‌లోని అని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ధోనీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 
 
ఈ క్రమంలో తాజాగా మరో అదిరిపోయే రికార్డు సాధించాడు. స్టంప్స్ వెనకాల మెరుపు వేగంతో కదిలే మహీ.. ఇప్పుడు పురుషుల టీ20 క్రికెట్‌లోనే అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. 
 
ఈ మ్యాచ్ ముందువరకు 207 క్యాచ్‌లతో దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్‌తో సమానంగా ఉన్న ధోనీ.. మార్‌క్రమ్ క్యాచ్ అందుకుని కొత్త రికార్డును తన పేరిట చేర్చుకున్నాడు. తర్వాతి స్థానంలో దినేశ్ కార్తిక్ (205 క్యాచ్‌లు), పాక్ మాజీ క్రికెటర్ క్రమాన్ అక్మల్ (172 క్యాచ్‌లు) ఉన్నారు.