సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (20:39 IST)

ఐపీఎల్ 2023 : ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వేదికలు ఖరారు

ipl 2023
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పోటీల్లో భాగంగా, ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వేదికలను ఖరారు చేసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లలో నాలుగు ఫ్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. 
 
మే 23వ తేదీన క్వాలిఫయర్‌-1, 24వ తేదీన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా నిర్వహిస్తామని తెలిపింది. మే 26వ తేదీన క్వాలిఫయర్‌-2, 28వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతాయని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
క్వాలిఫయర్ 1లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన మొదటి రెండు జట్ల మధ్య మే 23వ తేదీన చెన్నైలో జరుగుతుంది. మ్యాచ్ 24న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టీమ్ 3, టీమ్ 4 జట్ల మధ్య చెన్నైలో నిర్వహిస్తారు. 
 
మే 26వ తేదీన క్వాలిఫయర్ 2లో ఎలిమినేటర్ విజేత, క్వాలిఫయర్ ఒకటి ఓటమిపాలైన జట్ల మధ్య అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. 28వ తేదీన ఫైనల్ మ్యాచ్ క్వాలిఫయర్ ఒకటి విజేత, క్వాలిఫయర్ 2 విజేత జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది.