వన్డే ప్రపంచ కప్.. అక్టోబర్ 5న ప్రారంభం.. నవంబర్ 19న ముగియనుంది..
వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమై నవంబర్ 19న ముగియనుంది. పది జట్ల ఈ మెగా ఈవెంట్‌కు హోస్ట్ చేసే బీసీసీఐ కనీసం డజను వేదికలను షార్ట్‌లిస్ట్ చేసిందని, ఫైనల్ అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.
అహ్మదాబాద్‌ను పక్కన పెడితే, షార్ట్‌లిస్ట్‌లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై ఉన్నాయి. మొత్తం టోర్నమెంట్‌లో 46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్‌లతో సహా 48 మ్యాచ్‌లు ఉంటాయి.
బీసీసీఐ ఇంకా ఏ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయనే అంశంలో స్పష్టత ఇవ్వలేదు. వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్న నగరాలను కూడా పేర్కొనలేదు. ఒప్పందం ప్రకారం బీసీసీఐ ఐసీసీ ట్యాక్స్ ఎగ్జమ్షన్ కల్పించాల్సి ఉంది.