మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

మహిళా టీ20 ప్రపంచ కప్ : సెమీస్‌లో పోరాడి ఓడిన భారత జట్టు

woman cricket team
దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య సెమీస్ పోరు జరిగింది. ఇందులో భారత మహిళా జట్టు పోరాడి ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఫలితంగా ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. జట్టులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఒక్కరే బ్యాట్‌తో రాణించి అర్థ సెంచరీ చేశారు. ఈ ఓటమితో భారత్ ఇంటి ముఖం పట్టగా, ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
 
173 పరుగులు లక్ష్యఛేదనలో భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మత్ ప్రీత్ కౌర్ 52 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 43 చొప్పున పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరూ క్రీజ్ నుంచి నిష్క్రమించిన తర్వాత దీప్తి శర్మ ఒంటరిపోరాటం చేసినా మ్యాచ్ ఆఖరులో విజయానికి కావాల్సిన పరుగులు పెరిగిపోవడం, బంతులు లేకపోవడంతో రన్‌రేట్ పెరిగిపోయింది. 
 
మ్యాచ్ 20వ ఓవర్‌లో విజయానికి 16 పరుగులు చేయాల్సివుండగా, భారత్ 10 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆసీస్ బౌలర్లలో గార్డనర్ 2, డార్సీ బ్రౌన్ 2, మేగాన్ షట్, జెస్ జొనాస్సెన్ ఒకటి చొప్పు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆసీస్ మహిళల జట్టు టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.