శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

ఐపీఎల్ 2024 ఎడిషన్ ఎప్పటి నుంచి ప్రారంభమంటే...

ipl2022
దేశంలో ఐపీఎల్ క్రికెట్ సందడి ఆరంభంకానుంది. 2024 ఐపీఎల్ ఎడిషన్ మార్చి నెల 22వ తేదీ నుంచి మొదలుకానుంది. మే 26వ తేదీన అంతిమ పోరును నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేసిన ట్టు సమాచారం. అయితే, ఈ యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌ను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. సార్వత్రిక ఎన్నికల తేదీలకు ఐపీఎల్ 2024 షెడ్యూల్ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. 
 
అయితే, లోక్‌సభ ఎన్నికలు ఉన్నప్పటికీ స్వదేశంలోనే ఈ టోర్నీని నిర్వహించాలన్న పట్టుదలతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉంది. ఇక లోక్‌సభ ఎన్నికల సంవత్సరంలో ఐపీఎల్ జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. గతంలో 2009, 2014, 2019 సంవత్సరాల్లో జాతీయ ఎన్నికల సమయంలోనే ఐపీఎల్ కూడా జరిగింది. 2009, 2014 సీజన్‌లో భారత్ వెలుపల టోర్నీని నిర్వహించగా.. 2019లో ఇండియాలోనే నిర్వహించారు. 
 
ఎన్నికలతోపాటు ఐపీఎల్‌ను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. కాగా టీ20 వరల్డ్ కప్‌నకు ముందు జరగనున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ ఆటగాళ్లకు చాలా కీలకం కానుంది. అందుకే భారత ఆటగాళ్లతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మే 26న ఐపీఎల్ ఫైనల్ జరిగితే.. ఆరు రోజుల విరామంలో జూన్ 1న టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్ భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.