బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 26 మే 2024 (22:09 IST)

IPL final: KKR చేతిలో ఘోరంగా ఓడిపోబోతున్న SRH

SRH vs KKR
చివరి మ్యాచుల వరకూ తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిన SRH ఫైనల్ మ్యాచులో తడబాటుకు గురైంది. ఫలితంగా 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ సునాయాస లక్ష్యాన్ని ఛేదించడంలో KKR నైట్ రైడర్స్ చాలా సౌకర్యవంతంగా ముందుకు సాగుతోంది. 6 ఓవర్లు ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి 72 పరుగులు చేసింది. ఇక విజయం నల్లేరు మీద నడకలా వున్నట్లు కనబడుతోంది.
 
అంతకుముందు ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
సన్ రైజర్స్ హైదరాబాద్ : పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిడ్ హెడ్, అభిషేక్ వర్మ, రాహుల్ త్రిపాఠి, మార్కమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, టి.నటరాజన్
 
కోల్‌కతా నైట్ రైడర్స్... 
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్య్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్ దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.