గురువారం, 2 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (14:44 IST)

ఐసీసీ ర్యాంకింగ్స్: రాంచీ టెస్టులో 9 వికెట్లు.. అశ్విన్‌ను వెనక్కి నెట్టిన జడేజా

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నెం.1 స్థానంలో నిలిచాడు. రాంచీ టెస్టు ముందు వరకు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ర

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నెం.1 స్థానంలో నిలిచాడు. రాంచీ టెస్టు ముందు వరకు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కి నెట్టి.. అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రాంచీ టెస్టులో రవీంద్ర జడేజా చేసిన మెరుగైన ప్రదర్శనతో అతడి టెస్టు ర్యాంకు మెరుగైంది. ఈ టెస్టులో జడేజా మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో లెఫ్ట్ హార్మ్ స్పిన్నర్ అశ్విన్ రెండో స్థానంలోనూ, హెరాత్ మూడో స్థానంలో నిలిచారు. ఇక నాలుగైదు స్థానాల్లో జోష్ హజల్‌వుడ్,  జేమ్స్ ఆండర్సన్‌లు నిలిచారు. ఐసీసీ టాప్-5 బ్యాట్స్‌మెన్‌లో స్టీవెన్ స్మిత్ 942 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఛటేశ్వర్ పుజారా (861 పాయింట్లు) రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక జోరూట్ మూడో స్థానంలో, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐదో స్థానంలో కేన్ విలియమ్సన్ నిలిచాడు.