గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (23:46 IST)

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న కావ్యపాప యాక్షన్

Kavya Maran
Kavya Maran
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ జట్టు రికార్డుల మోత మోగించింది. 
 
ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ విజయం తర్వాత ఎస్ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్ రియాక్షన్ ఇప్పుడు వైరల్‌గా మారింది. జట్టు గెలుపు సందర్భంగా కావ్య మారన్ ఆనందోత్సాహాలతో కనిపించింది. స్టాండ్స్ నుండి తన టీమ్‌ని ఉత్సాహపరుస్తూ కనిపించింది. 
 
గెలిచిన తర్వాత కావ్య మారన్ ఆనందంతో ఎగిరిగంతేసింది. ట్విట్టర్‌లో చాలా మంది ఆమె స్పందనను పంచుకున్నారు. 'ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి కావ్య మారన్' అని క్యాప్షన్ ఇచ్చారు. 
 
ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందనలను పోస్టు చేస్తున్నారు. ఇంకా  సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ సన్ రైజర్స్, కావ్య మారన్ పట్ల జైలర్ ఆడియో రిలీజ్ సందర్భంగా చేసిన కామెంట్స్‌ను జోడిస్తూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.