సన్ రైజర్స్ హైయస్ట్ స్కోర్‌తో అదిరే రికార్డ్- తేలిపోయిన ముంబై
ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మెరుస్తోంది. సన్ రైజర్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగులు చేసింది.
ముంబయి ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించి.. గతంలో అత్యధిక స్కోరు రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట వున్న 263 పరుగుల రికార్డును సన్ రైజర్స్ చెరిపేసింది. ఇందులో భాగంగా 277 పరుగులతో హయ్యస్ట్ స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెన్ చెలరేగి 4 ఫోర్లు, 7 సిక్సర్లతో ముంబయి బౌలర్లను చీల్చిచెండాడాడు.
క్లాసెన్ 34 బంతుల్లోనే 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐడెన్ మార్ క్రమ్ 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. అభిషేక్ శర్మ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ భారీ స్కోరును నమోదు చేసుకుంది.