సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (22:25 IST)

సంగక్కర, సచిన్ రికార్డుల్ని బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

virat kohli
ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఆరుసార్లు 2 వేల పరుగులు చేశాడు
ఏడుసార్లు 2000 పరుగులు చేసిన కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు
దక్షిణాఫ్రికా గడ్డపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 
 
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో భారత్ ఓడిపోయినప్పటికీ, విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం అందరినీ ఆకట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 82 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు. 
 
సంగక్కర ఒక సీజన్‌లో 6 సార్లు 2 వేల పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డు కోహ్లి సొంతం. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 పరుగులు చేయడం కోహ్లీకి ఇది ఏడోసారి. అదే ఊపులో భారత బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా కింగ్ కోహ్లీ అధిగమించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా కోహ్లీ కొత్త ఫీట్ నమోదు చేశాడు.
 
సౌతాఫ్రికాలో సచిన్ 38 మ్యాచ్‌ల్లో 1724 పరుగులు చేయగా, ఈరోజు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. సఫారీ గడ్డపై కోహ్లీ 29 మ్యాచ్‌ల్లో 1750* కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కోహ్లీ పరుగులలో 5 సెంచరీలు ఉన్నాయి.