శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (09:24 IST)

ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. స్టీవ్ స్మిత్‌కు వరించని కెప్టెన్సీ

ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ..ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రకటించిన వన్డే జట్టుకు కూడా కెప్టెన్ అయ్యాడు. ఈ అవార్డు ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను వరిస

ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ..ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రకటించిన వన్డే జట్టుకు కూడా కెప్టెన్ అయ్యాడు. ఈ అవార్డు ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను వరిస్తుందని అందరూ భావించారు. కానీ కోహ్లీ ఈ అవకాశాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.  మూడు రోజుల క్రితం సీఏ ప్రకటించిన టెస్టు జట్టుకు కూడా విరాటే నాయకుడు. 
 
2016లో భారత జట్టు కెప్టెన్‌ కేవలం 10 వన్డేలు మాత్రమే ఆడాడు. కానీ 50 ఓవర్ల ఫార్మాట్లో తానో అత్యుత్తమ క్రికెటర్‌ అని నిరూపించుకున్నాడని సీఏ తెలిపింది. 2016లో కోహ్లి తానాడిన 10 ఇన్నింగ్స్‌లో ఎనిమిదింటిలో 45 అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేశాడు.  
 
క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) వన్డే జట్టు-2016 
విరాట్‌ కోహ్లి (భారత్‌- కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా), క్వింటన్‌ డి కాక్‌ (దక్షిణాఫ్రికా), స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా), బాబర్‌ ఆజమ్‌ (పాకిస్థాన్‌), మిచెల్‌ మార్ష్‌ (ఆస్ట్రేలియా). బట్లర్‌ (ఇంగ్లాండ్‌), జస్‌ప్రీత్‌ బుమ్రా (భారత్‌), ఇమ్రాన్‌ తాహిర్‌ (దక్షిణాఫ్రికా), హేస్టింగ్స్‌ (ఆస్ట్రేలియా), స్టార్క్‌ (ఆస్ట్రేలియా).