శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2015 (09:13 IST)

జనవరి 28 నుంచి ఎంసీఎల్: తొలి మ్యాచ్‌లో సెహ్వాగ్ వర్సెస్ గంగూలీ

గతంలో అమెరికాలో జరిగిన ఆల్ స్టార్స్ క్రికెట్ లీగ్ తరహాలో మాస్టర్స్ ఛాంపియన్ లీగ్ (ఎంసీఎల్) సందడి ప్రారంభం కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. ఎమిరేట్స్ బోర్డ్-ఎంసీఎల్ మధ్య కుదిరిన పదేళ్ల ఒప్పందంలో భాగంగా.. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగనున్న 18 మ్యాచ్‌లలో ఆరు జట్లు పోటీకి రెడీ అవుతున్నాయి. 
 
ఈ టోర్నీలో లిబ్రా లెజెండ్స్, జెమినీ అరేబియన్స్, కాప్రికోర్న్ కమాండర్స్, లియో లైట్స్, విర్గో సూపర్ కింగ్స్, సాగిటారియస్ స్ట్రయికర్స్ జట్లు బరిలోకి దిగనున్నాయి. తొలి మ్యాచ్‌లో గంగూలీకి చెందిన లిబ్రా లెజెండ్స్‌తో సెహ్వాగ్‌కి చెందిన జెమినీ అరేబియన్స్ తలపడనుంది. 15 మంది సభ్యులతో కూడిన జట్లు ఈ పోటీలో ఉంటాయి. జాక్వెస్ కల్లీస్, ముత్తయ్య మురళీధరన్, కుమార సంగక్కర, ఆడమ్ గిల్ క్రిస్ట్, వెటోరీ, బ్రెట్ లీ, బ్రియాన్ లారా వంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.