బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 ఏప్రియల్ 2025 (13:37 IST)

లైవ్‌లో రింకూ చెంప ఛెళ్లుమనిపించిన కుల్దీవ్ యాదవ్ (Video)

rinku - kuldeep
ఐపీఎల్ సీజన్ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాటిల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కోల్‌తా బ్యాటర్ రింకూ సింగ్‌పై చేయి చేసుకున్నాడు. లైవ్‌పై కుల్దీప్ యాదవ్.. రింకూ చెంప ఛెళ్లుమనిపించాడు. లైవ్‌ టీవీలో ఈ దృశ్యాలు రికార్డు కావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో కుల్దీప్ యాదవ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
 
మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్, ఇతర ఆటగాళ్లు కలిసి మైదానంలో మాట్లాడుకుంటున్నారు. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన కుల్దీప్ ఉన్నట్టు రింకూ చెంపపై కొట్టాడు. ఏం జరిగిందో తెలియక కోల్‌కతా బ్యాటర్ రింకూ ఒకింత ఆశ్చర్యానికి లోనుకావడంతో పాటు కుల్దీప్ యాదవ్ కొట్టిన దెబ్బను సరదాగా తీసుకున్నాడు. అయితే, కుల్దీప్ యాదవ్ మరోమారు కొట్టడంతో రింకూ అసహనానికి గురైనట్టు వీడియోను చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
కాగా, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై కోల్‌కతా జట్టు 14 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అటు వరుసగా రెండో ఓటమిని చవిచూసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దిగజారింది.