మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (10:22 IST)

పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయే స్థితికి చేరుకుంటే.. కోహ్లీకి ధోనీ బాసటగా నిలిచాడు..

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అంతా విరాట్ కోహ్లీ పేరునే చెప్తోంది. అయితే అందరి నోట 'శభాష్‌ విరాట్‌' అనిపించుకొంటున్న కోహ్లీ కెరీర్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని కాపాడినట్లు చెప్పాడు ఒకప్పటి

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అంతా విరాట్ కోహ్లీ పేరునే చెప్తోంది. అయితే అందరి నోట 'శభాష్‌ విరాట్‌' అనిపించుకొంటున్న కోహ్లీ కెరీర్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని కాపాడినట్లు చెప్పాడు ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్ కోహ్లీ గురించి మాట్లాడాడు. ప్రస్తుతం టీమిండియా టెస్టు సారథి విరాట్‌కోహ్లీ తన తొలి ఆరు టెస్టుల్లో పేలవ ప్రదర్శన కారణంగా జట్టులో స్థానం కోల్పోయే స్థితికి చేరుకున్న సమయంలో రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు నిర్ణయించారు.
 
కోహ్లీ 2011లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి ఆరు మ్యాచుల్లో అతడిది పేలవ ప్రదర్శనే. వరుసగా 4, 15, 0, 27, 30, 52, 63, 11, 0, 23, ఒక ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ చేయలేదు. దీంతో 2012లో జరిగిన పెర్త్‌ టెస్టులో కోహ్లీ స్థానంలో రోహిత్‌శర్మను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారు. దీంతో కోహ్లీకి అండగా నిలవాలని కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, వైస్‌ కెప్టెన్‌ అయిన సెహ్వాగ్‌ నిర్ణయించుకున్నారట. కెరీర్‌లో కీలకమైన పెర్త్ టెస్టులో కోహ్లీ 44, 7 
 
కెరీర్‌లో కీలకమైన పెర్త్‌ టెస్టులో కోహ్లీ 44, 75 పరుగులు చేశాడు. ఆ తర్వాత అడిలైడ్‌ మ్యాచ్‌లో తొలి శతకం నమోదు చేశాడని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. తన కెరీర్‌ను కాపాడిన ధోని నుంచి కోహ్లీ 2014లో టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి టీమిండియాను వరుస విజయాల బాట పట్టించిన సంగతి తెలిసిందే.