శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జులై 2023 (20:41 IST)

ధోనీ కోసం 77 అడుగుల భారీ కటౌట్..

Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఆయన అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ కటౌట్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
 
ధోనీ 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని 77 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఇప్పటికే 52 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశామన్నాడు.
 
నందిగామలో 77 అడుగులు పెట్టామని ఓ అభిమాని వెల్లడించాడు. తాము ధోనీపై అభిమానంతో ఇదంతా చేస్తున్నట్లు తెలిపాడు.