శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (17:26 IST)

కటక్ వన్డే: యువీ-ధోనీల అద్భుత ఇన్నింగ్స్.. యువీ @150 - ధోనీ @ 134

ఇంగ్లండ్‌తో జరుగుతున్న కటక్ రెండో వన్డేలో మాజీ కెప్టెన్ ధోనీ సత్తా చాటాడు. వోక్స్ బౌలింగ్‌లో ధోనీ లాంగాన్ మీదుగా ఓ భారీ సిక్స్ కొట్టాడు. తొలి వన్డేలో వోక్స్ బౌలింగ్‌లోనే ఇటువంటి షాట్ కొట్టబోయి అవుటైన

ఇంగ్లండ్‌తో జరుగుతున్న కటక్ రెండో వన్డేలో మాజీ కెప్టెన్ ధోనీ సత్తా చాటాడు. వోక్స్ బౌలింగ్‌లో ధోనీ లాంగాన్ మీదుగా ఓ భారీ సిక్స్ కొట్టాడు. తొలి వన్డేలో వోక్స్ బౌలింగ్‌లోనే ఇటువంటి షాట్ కొట్టబోయి అవుటైన ధోనీ ఆ తప్పును సరిదిద్దుకున్నాడు. ఈసారి మాత్రం ఫ్లాట్ బ్యాట్‌తో పుల్ షాట్‌కు ఎదురులేకపోయింది. వోక్స్ అలా చూస్తుండగా ఆ బంతి బుల్లెట్‌లా దూసుకుపోయి బౌండరీ అవతల నేలను బలంగా తాకింది. 
 
ఈ షాట్ ఫర్‌ఫెక్ట్‌గా కుదిరింది. ధోనీకి కలిసొచ్చిన సందర్భం ఏమిటంటే ప్లంకెట్ బౌలింగ్‌ (28.2 ఓవర్ల వద్ద)లో ఓ బంతిని ధోనీ ఫ్లిక్ చేయబోయాడు. బంతి లీడింగ్ ఎడ్జ్‌కు తగిలి గాల్లోకి ఎగిరింది. దీంతో అద్భుత సిక్స్‌ను నమోదు చేసుకున్నాడు. అంతేగాకుండా సూపర్ ఇన్నింగ్స్‌తో ఆడిన ధోనీ తన వన్డే కెరీర్‌లో పదో సెంచరీని నమోదు చేసుకున్నాడు. 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ధోనీకిదే మొదటి శతకం కావడం విశేషం. 
 
యువీ 150 పరుగులు పూర్తి చేసిన వెంటనే ధోనీ కూడా సెంచరీ చేసి స్టేడియం మొత్తం మారుమోగేలా చేశాడు. అయితే శతకం తర్వాత కూడా నిలదొక్కుకుని ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ధోనీ 134 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ప్లుంకెట్ బౌలింగ్‌లో ధోనీ వెనుదిరిగాడు. మొత్తం 122 బంతులాడిన ధోనీ పది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 134 పరుగులు సాధించాడు. అంతకుముందు టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ కూడా శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 
 
150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. జట్టు స్కోరు 281 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 126 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రెండో వన్డేలో యువీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడిన యువీ అంతే వేగంగా 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
 
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో యువరాజ్ సింగ్ సెంచరీ చేశాడు. కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులో దిగిన యువరాజ్ సింగ్ 98 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్డేల్లో యువరాజ్‌కి ఇది 14వ సెంచరీ కావడం గమనార్హం.