మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (12:52 IST)

నాకు రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధోనీ

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌పై సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆమ్ర‌పాలి సంస్థ త‌న‌కు 40 కోట్లు ఇవ్వాల‌ని, గతంలో ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసానని, తనకు రావాల్సిన బకాయి మొత్తాలు తన చేతికి అందలేదంటూ ధోనీ కోర్టుకు వెళ్లారు. 
 
ఆమ్ర‌పాలి రియ‌ల్ ఎస్టేట్ గ్రూపుపై ఇప్ప‌టికే అనేక కేసులు ఉన్నాయి. ఈ కంపెనీ ఒప్పందం ప్ర‌కారం ప్లాట్లు డెలివ‌రీ చేయ‌డం లేద‌ని ఆ సంస్థ‌పై సుమారు 46 వేల మంది పిటిష‌న్లు కూడా వేసారు. 
 
అయితే ధోనీ ఆ కంపెనీకి దాదాపు ఆరేళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసారు. 2009లో ధోనీ ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమ్ర‌పాలి సంస్థ‌పై ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ధోనీ ఆ సంస్థతో తనకు ఉన్న ఒప్పందాన్ని 2016 సంవత్సరంలో రద్దు చేసుకున్నారు.