శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (22:36 IST)

బ్లాక్ చికెన్ వ్యాపారంలోకి ధోనీ.. 2వేల కోడిపిల్లల్ని ఆర్డర్ చేశాడోచ్! (video)

Kadaknath
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్లాక్ చికెన్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక ధోనీ కేవలం ఐపీఎల్ లోనే ఆడుతున్నాడు. సంవత్సరానికి రెండు నెలలు మాత్రమే క్రికెట్ ఆడే ధోనీ మిగతా సమయం అంతా వ్యవసాయానికి, ఇతర వ్యాపార కార్యకలాపాల కోసమే కేటాయిస్తున్నాడు. ఇటీవల కడక్ నాథ్ కోళ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ధోనీ, కొత్తగా 2 వేల కోడిపిల్లలకు ఆర్డర్ చేశారు.   
 
మధ్యప్రదేశ్‌లోని జబువాలో ఓ కోఆపరేటివ్ సొసైటీ ఈ కడక్ నాథ్ కోళ్ల ఉత్పత్తి, పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా పలువురు కోడిపిల్లలు కొనుగోలు చేస్తున్నారు. ధోనీ కూడా ఈ సహకార సమాఖ్యకే ఆర్డర్ చేశాడు. 
 
ధోనీ కడక్ నాథ్ కోడిపిల్లలు కొనుగోలు చేసిన విషయాన్ని ఇక్కడి జిల్లా కలెక్టర్ నిర్ధారించారు. ఓ వాహనంలో రెండు వేల కోడిపిల్లలను రాంచీలోని ధోనీ వ్యవసాయ క్షేత్రానికి తరలించినట్టు వెల్లడించారు. 
 
ఇకపోతే.. బ్లాక్ చికెన్‌గా పేరున్న కడక్ నాథ్ కోళ్ల ధరలు ఎక్కువే. ఈ కోడి మాంసంలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. దాంతో ఈ తరహా కోళ్లను పరిశ్రమ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు. వారిలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కూడా చేరిపోయాడు.