సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (22:55 IST)

బాలీవుడ్ హీరోగా సీఎస్కే జట్టు కెప్టెన్?: ధోనీ ఏమంటున్నారు!!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బాలీవుడ్ హీరోగా అవతారమెత్తనున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ధోనీ స్పందించారు. బాలీవుడ్‌లోకి భాగ‌స్వామ్యం కావాల‌ని త‌న‌కు ప్ర‌ణాళిక‌ల్లేవ‌ని తేల్చిచెప్పారు. 
 
అదేసమయంలో సీఎస్కే జట్టు తరపున చివరి మ్యాచ్ ఆడాలనివుందన్నాడు. అయితే, తాను మెరుగ్గా ఆడ‌ని రోజే అదే చివరి మ్యాచ్ అంటే ఫేర్‌వెల్ గేమ్ అని అన్నారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున చివ‌రి మ్యాచ్ ఆడాల‌ని ఆశాభావంతో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. 
 
త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న టీ-20 వ‌ర‌ల్డ్ కప్ టోర్నీకి టీం ఇండియా జ‌ట్టుకు మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఇండియా సిమెంట్స్ మార్కెటింగ్ ఉపాధ్య‌క్షుడిగా ఉన్నారు. ఇక ముందు కూడా త‌న అడ్వ‌ర్టైజ్‌మెంట్ అసైన్‌మెంట్ల‌ను కొన‌సాగించ‌డానికే ప్రాధాన్యమిస్తానని తెలిపారు. 
 
బాలీవుడ్‌లో భాగ‌స్వామి కావాల‌ని ప్రణాళిక‌ల్లేవు. బాలీవుడ్ నా క‌ప్ ఆఫ్ టీ కాదు.. నాకు అడ్వ‌ర్టైజ్‌మెంట్స్ ఉన్నాయి.. వాటితో సంతోషంగా ఉన్నాన‌ని చెప్పాడు. సినిమాల్లో న‌టించాలంటే చాలా క‌ష్ట‌మైన వృత్తి, దాన్ని మేనేజ్ చేయ‌డం చాలా క‌ష్టం అని వివరించాడు.