బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (16:13 IST)

ఆ విషయంలో స్మిత్ కోహ్లీ కంటే ముందున్నాడు..? అరోన్ ఫించ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్ ముగించే సమయానికి వన్డేల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అవుతాడని ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ జోస్యం చెప్పాడు. ఒకే రకంగా ఎప్పుడూ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కష్టమే కాని వన్డే ఫార్మాట్‌లో స్మిత్ కంటే విరాట్ గొప్ప బ్యాట్స్‌మన్ అని కీర్తించాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు లేదా సెంచరీలు సాధించి ఉండవచ్చు, కానీ విరాట్ టార్గెట్ ఛేదించేటప్పుడు సెంచరీ సాధించడం అసాధారణమని కొనియాడాడు.
 
అయితే టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం స్మిత్ కంటే కోహ్లీ కొంచెం వెనుకబడి ఉన్నాడని ఫించ్ చెప్పాడు. 'టెస్ట్‌లో విరాట్ కోహ్లీ ఆటతీరు బాగానే ఉంది. అతను ఇంగ్లాండ్‌లోని జేమ్స్ ఆండర్సన్ వంటి బౌలర్లపై కొంచెం కష్టపడుతున్నట్లు కనిపించాడు, కాని స్మిత్ టెస్ట్ ఫార్మాట్‌లో ఎప్పుడూ కష్టపడలేదు. అది అతన్ని టెస్ట్ ఫార్మాట్‌లో ఉత్తమ ఆటగాడిగా చేస్తుందని ఫించ్ పేర్కొ న్నాడు. 
 
ఈ విషయంలో స్మిత్, కోహ్లీ కంటే ముందున్నాడని అన్నాడు. ఇక స్టీవ్ స్మిత్ ప్రస్తుతం టెస్టుల్లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. అలాగే టి 20 ఫార్మాట్ విషయానికి వస్తే కోహ్లీ టాప్ ప్లేయర్ అన్నాడు.