శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2016 (17:17 IST)

అశ్విన్‌ 27 వికెట్లతో అదుర్స్: 321 పరుగుల తేడాతో భారత్ వైట్ వాష్.. జయభేరి

భారత్-కివీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 321 పరుగుల తేడాతో గెలిచింది. నాలుగో రోజు ఆటలో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ గెలిచేందు

భారత్-కివీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 321 పరుగుల తేడాతో గెలిచింది. నాలుగో రోజు ఆటలో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ గెలిచేందుకు సెకండ్ ఇన్నింగ్స్‌లో 475 పరుగులు చేయాల్సి ఉండగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. 
 
ముఖ్యంగా భారత మ్యాజిక్ బౌలర్ అశ్విన్ చేతిలో కంగుతింది. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్ ఇప్పుడు కూడా ఏడు వికెట్లు తీసి చెలరేగాడు. అంతకుముందు భారత జట్టు రెండు ఇన్నింగ్స్‌లను డిక్లేర్ చేయగా, కివీస్ జట్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆలౌటైంది. 
 
ఇకపోతే.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. కెరీర్‌లో పీక్ ఫాంలో ఉన్న అశ్విన్ కేవలం 38 టెస్టుల్లో పది వికెట్ల ఫీట్‌ను ఆరు సార్లు నమోదు చేయడం విశేషం. దీంతో పాటు ఇప్పటివరకు 5 వికెట్ల ఫీట్‌ను 20 టెస్టుల్లో సాధించిన బౌలర్‌గా నిలిచాడు.
 
కివీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయడం వెనుక అశ్విన్ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. రెండు సార్లు పది వికెట్ల ఘనత సాధించిన అశ్విన్ ఈ సిరీస్‌ను ఒంటిచేత్తో భారత్‌కు విజయాన్ని అందించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు నేలకూల్చాడు. దీంతో అశ్విన్ ఈ సిరీస్‌లో మొత్తం 27 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం విశేషం.